News March 10, 2025

ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

image

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 10, 2025

కదిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

image

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు లోకేశ్ వెంట ఉన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.

News March 10, 2025

రేపు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

image

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.

News March 10, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి(D) కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం(D) పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి ఈ జాబితాలో మీ ఊరు ఉందేమో చూసుకోండి.

error: Content is protected !!