News June 8, 2024

రాజకీయాల్లో రామోజీరావు కింగ్ మేకర్: రజనీకాంత్

image

తన గురువు, మార్గదర్శకుడు రామోజీరావు మరణం బాధ కలిగించిందన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. జర్నలిజం, సినిమాల్లో చరిత్ర సృష్టించిన ఆయన రాజకీయాల్లో కింగ్‌మేకర్ అని కొనియాడారు. ఉషాకిరణ్ మూవీస్‌లో పనిచేసిన నాటి నుంచి జబర్దస్త్ వరకు ఆయనతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. ఇక బోయపాటి శ్రీను తదితర సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ మృతికి సంతాపం ప్రకటించారు.

Similar News

News November 29, 2024

అంతరిక్షం నుంచి అగ్నిపర్వతం ఫొటో

image

ఐస్‌ల్యాండ్‌లోని సుంధున్‌కర్‌లో ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం దృశ్యాలను అంతరిక్షం నుంచి నాసా చిత్రీకరించింది. సముద్రం పక్కన కొండపై ఎగిసి పడుతున్న ఎర్రటి లావా, పొగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటో అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘NOV 24న తీసిన ఈ చిత్రం ఉష్ణ తీవ్రతను గుర్తించడానికి సహాయపడుతుంది. లావా నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వాయువులు వెలువడ్డాయి’ అని నాసా పేర్కొంది.

News November 29, 2024

గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి

image

TG: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News November 29, 2024

ఇదే బౌలింగ్ అటాక్ కొనసాగించండి: పుజారా

image

BGTలో ఆడిలైడ్ పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతోన్న టీమ్‌ఇండియాకు క్రికెటర్ పుజారా సలహా ఇచ్చారు. తొలి టెస్ట్‌లో సక్సెస్ అయిన బౌలింగ్ అటాక్‌నే కొనసాగించాలన్నారు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలనే మరోసారి ఎంపిక చేయాలని సూచించారు. బుమ్రా ప్రణాళికలను అమలు చేస్తూ వారిద్దరూ వికెట్లు సాధిస్తున్నట్లు చెప్పారు. అటు, KL రాహుల్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలని, ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌‌లో పంపితే బాగుంటుందన్నారు.