News May 3, 2024
రేవణ్ణ, ప్రజ్వల్‌పై రేప్, కిడ్నాప్ కేసులు

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై రేప్, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో పని చేసే పనిమనిషికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంలోనే తండ్రీకొడుకులపై సిట్ బృందం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నిన్ననే వీరు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులే వారిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది.
Similar News
News January 4, 2026
బాపట్ల: మృతి చెందిన బాలుడు హాస్టల్ విద్యార్థి..!

కొరిశపాడు మండలం పమిడిపాడులో చెక్ డ్యామ్ వద్ద ఆదివారం ఈతకు దిగి మృతి చెందిన బాలుడి వివరాలు లభ్యమయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు పిల్లి చిన్న బాబు రాచపూడిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం కావడంతో ముగ్గురు విద్యార్థులు ఈతకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ఆసుపత్రికి తరలించారు.
News January 4, 2026
ఫైరింగ్ నేర్చుకుని భార్యను కాల్చి చంపిన టెకీ

బెంగళూరులోని బసవేశ్వరలో గతనెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్యకేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట TNకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.
News January 4, 2026
ఫోర్బ్స్ ’40 అండర్ 40’లో ఏకైక భారతీయుడు

ప్రపంచ వ్యాప్తంగా యువ బిలియనీర్లను గుర్తించే ఫోర్బ్స్ ‘40 అండర్ 40’లో ఈసారి నలుగురు భారత సంతతి వ్యాపారవేత్తలకు చోటు లభించింది. ఇందులో భారత్ నుంచి ఏకైక బిలియనీర్‌గా జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిలిచారు. 39 ఏళ్ల నిఖిల్ నెట్‌వర్త్ $3.3Bగా ఉంది. ఈ లిస్ట్‌లో AI స్టార్టప్ మెర్కోర్‌ను స్థాపించిన ఆదర్శ్ హిరేమత్, సూర్య మిద్దా కూడా ఉన్నారు. ఈ జాబితాలో వీళ్లే అతి చిన్న వయస్కులైన (22 ఏళ్లు) బిలియనీర్లు.


