News May 3, 2024
రేవణ్ణ, ప్రజ్వల్‌పై రేప్, కిడ్నాప్ కేసులు
మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై రేప్, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో పని చేసే పనిమనిషికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంలోనే తండ్రీకొడుకులపై సిట్ బృందం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నిన్ననే వీరు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులే వారిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది.
Similar News
News November 11, 2024
వాటర్ వేస్టేజ్ తగ్గించేలా..!
రంగుల బట్టలని తయారుచేసేందుకు ఎంత నీటి కాలుష్యం జరుగుతుందో ప్రజలు పట్టించుకోవట్లేదని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(USA) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా బట్టలకు రంగు అద్దడానికి 5 ట్రిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారని తెలిపింది. కాగా, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు హీట్‌లెస్ డై ప్రక్రియను అభివృద్ధి చేశామని, దీని ద్వారా 90శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చని చైనాకు చెందిన NTX అనే కంపెనీ వెల్లడించింది.
News November 11, 2024
హలో.. మినిస్ట్రీ ఆఫ్ సెక్స్!
రష్యాలో ఇక సంతానోత్పత్తి సమస్య ఉంటే అక్కడి ప్రజలు ఇలా ఫోన్ చేస్తారేమో! ఎందుకంటే జననాల రేటు పెంచేందుకు Ministry of Sex (ప్రత్యేక మంత్రిత్వ శాఖ) ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. భాగస్వాముల ఏకాంతాన్ని ప్రోత్సహించేలా రాత్రి 10 నుంచి 2 వరకు ఇంటర్నెట్, కరెంట్ కోత; మొదటి డేట్‌కు వెళ్లే వారికి ₹4,300; పెళ్లి రోజు హోటల్లో ఉంటే పబ్లిక్ ఫండ్స్ కింద ₹22,618 సాయం ఇవ్వాలని చూస్తోంది.
News November 11, 2024
ఆ డొమైన్ ఫ్రీగా ఇస్తాం: దుబాయ్ యూట్యూబర్లు
JioHotstar డొమైన్‌ను ఢిల్లీ యాప్ డెవలపర్ నుంచి దుబాయ్‌కు చెందిన ఇద్దరు యూట్యూబర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సైట్‌ను రిలయన్స్‌కు ఇవ్వాలంటే రూ.కోటి చెల్లించాలని గతంలో వీరు డిమాండ్ చేశారు. అయితే, తాజాగా ఫ్రీగా ఇస్తామంటూ ట్విస్ట్ ఇచ్చారు. jiohotstar.com డొమైన్ వారి దగ్గర ఉండటమే ఉత్తమమని భావిస్తున్నామని, అందుకే ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వారు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు.