News September 17, 2024
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన చిన్మయి
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. కాగా ఆమె గతంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.
Similar News
News October 14, 2024
కాల్పులకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి నార్త్ కొరియా ఆదేశాలు
దక్షిణ కొరియా తమ దేశంలోకి డ్రోన్లను పంపిస్తోందని ఆరోపిస్తూ తమ సైన్యాన్ని నార్త్ కొరియా సమాయత్తం చేసింది. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా వెంటనే కాల్చేయాలని స్పష్టం చేసింది. తమ అధినేత కిమ్‌ను విమర్శించే పార్సిళ్లను దక్షిణ కొరియా పంపుతోందని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణల్ని సియోల్ కొట్టిపారేస్తోంది. వాటిని తాము పంపడం లేదని తేల్చిచెబుతోంది.
News October 14, 2024
J&Kలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News October 14, 2024
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం
APలో అల్పపీడన ప్రభావం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు NDRF బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం <<14350584>>ఏర్పడనుందని<<>> అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.