News September 16, 2024
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. మరిన్ని సంచలన విషయాలు

జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన యువతి పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తన వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడని తెలిపారు. లైంగికంగా ఎంతో వేధించాడని, సహకరించకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని వాపోయారు. ఆమె ఇంట్లోనే 3 గంటలు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు, అనంతరం ఆమెకు వైద్యపరీక్షలు చేయించేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు.
Similar News
News January 17, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.
News January 17, 2026
మనోవాంఛలు నెరవేర్చే మహా దుర్గా మంత్రం

‘‘ఓం క్లీం శ్రీం యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః క్లీం శ్రీం ఓం’’
పఠన ఫలితం: ఈ శక్తిమంతమైన మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా తొలగిపోయి, సాధకుడికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సకల బాధలు, కష్టాలు నివారణ అవుతాయి. శత్రు బాధలు నశించి, మనోవాంఛలు నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా లభిస్తుంది.
News January 17, 2026
IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.


