News August 20, 2024

‘రేప్’ దోషులకు ఈ దేశాల్లో మరణమే!

image

ఘోరమైన హత్యాచారాల దోషులకు సైతం భారత్‌లో ఉరి శిక్ష పడటం చాలా అరుదు. ఏళ్ల తరబడి విచారణలు, క్షమాభిక్షలు, మానవ హక్కులు వంటి పలు అంశాలు వారిని రక్షిస్తుంటాయి. కానీ కొన్ని దేశాల్లో దోషుల్ని చంపటమే సరైనదిగా భావిస్తారు. సౌదీలో రేపిస్టులకు బహిరంగ శిరచ్ఛేదం ఉంటుంది. ఉత్తర కొరియాలో కాల్చి చంపుతారు. ఇక పాక్, చైనా, ఇరాక్, ఈజిప్టు, క్యూబా, యూఏఈ, అఫ్గాన్ దేశాల్లోనూ దోషులకు మరణశిక్షలే అమలుచేస్తారు.

Similar News

News September 16, 2024

బైడెన్‌‌, కమలను చంపేందుకు ఎవరూ ట్రై చేయట్లేదు: మస్క్

image

US అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం పట్ల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ‘బైడెన్, కమలను చంపాలని ఎవరూ కనీసం ప్రయత్నించడం లేదు’ అని సమాధానమిచ్చారు. ట్రంప్‌కు మస్క్ చాలాకాలంగా బహిరంగంగానే మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. అటు ట్రంప్‌ 2సార్లు ప్రమాదాన్ని తప్పించుకోవడంతో అమెరికావ్యాప్తంగా ఆయనకు సానుభూతి పెరుగుతోంది.

News September 16, 2024

భయపడే మహిళతో శృంగారం అత్యాచారమే: హైకోర్టు

image

లైంగిక సంబంధానికి మహిళ అంగీకారం ఉన్నప్పటికీ అది భయంతో లేక తెలియనితనంతో కూడినదైతే ఆ సంబంధం అత్యాచారం కిందకే వస్తుందని అలహాబాద్ కోర్టు తేల్చిచెప్పింది. తన ఇష్టం లేకుండా భర్త అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పెట్టిన కేసును సదరు భర్త న్యాయస్థానంలో సవాలు చేశారు. అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. స్త్రీ భయంతో ఒప్పుకొంటే అది ఆమె శ‌ృంగారానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.

News September 16, 2024

పెళ్లిపై హీరోయిన్ అదితి పోస్ట్

image

హీరో సిద్ధార్థ్‌తో <<14114235>>పెళ్లి <<>>అనంతరం సోషల్ మీడియాలో హీరోయిన్ అదితిరావు హైదరీ తొలి పోస్ట్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా మహాసముద్రం మూవీ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.