News October 12, 2024

అత్యాచార ఘటన.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Similar News

News November 6, 2024

12 ఎకరాల స్థలం కొన్న పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు. ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే ఇక్కడ పవన్ ఇల్లు, క్యాంప్ కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలు కొన్నారు.

News November 6, 2024

16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా

image

AP: ఇవాళ వెలువడాల్సిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 16,347 టీచర్ పోస్టులతో నేడు మెగా డీఎస్సీ ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. మరోవైపు డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

News November 6, 2024

US POLLS: ట్రంప్ రెండు, కమల ఒకచోట గెలుపు

image

అమెరికాలో రాష్ట్రాలవారీగా పోలింగ్ పూర్తవుతోంది. దీంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా ఇండియానా(11 ఎలక్టోరల్ ఓట్లు), కెంటకీ(8 ఎలక్టోరల్ ఓట్లు)లో ట్రంప్ విజయం సాధించారు. వెర్మాంట్‌లో కమలా హారిస్(3 ఎలక్టోరల్ ఓట్లు) గెలుపొందారు. అంతకుముందు డిక్స్‌విల్లే నాచ్‌లో చెరో 3 ఎలక్టోరల్ ఓట్ల చొప్పున గెలవడంతో టై అయింది. తొలుత మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తారో వారిదే అధ్యక్ష పీఠం.