News August 18, 2024
రేర్ కాంబినేషన్.. ఆమిర్ ఖాన్, లోకేశ్ కనగరాజ్ మూవీ?
మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ రాబోతోందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.
Similar News
News September 8, 2024
నా జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయి: తమన్నా
టీనేజ్‌లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
News September 8, 2024
వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ హుకుం
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను BJP ఆదేశించినట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలని BJP ఆదేశించడం గమనార్హం.
News September 8, 2024
‘ఎమర్జెన్సీ’కి U/A సర్టిఫికెట్.. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశం
బాలీవుడ్ నటి కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో బోర్డు సర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. తాజాగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్‌క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.