News April 5, 2024
రష్మిక బర్త్ డే.. ‘పుష్ప-2’ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే కావడంతో అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వారు ఆమెకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ సినిమాలోని ఆమె లుక్తో పోస్టర్ను రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డేకి మూవీ టీజర్ను రిలీజ్ చేస్తున్నందున.. ఈరోజు ఆమె లుక్ రివీల్ చేయాలని కోరుతున్నారు.
Similar News
News December 12, 2025
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.
News December 12, 2025
అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.


