News April 5, 2024
రష్మిక బర్త్ డే.. ‘పుష్ప-2’ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే కావడంతో అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వారు ఆమెకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ సినిమాలోని ఆమె లుక్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డేకి మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నందున.. ఈరోజు ఆమె లుక్ రివీల్ చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 23, 2025
పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!
దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్‌తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.
News January 23, 2025
జైలు శిక్షపై స్పందించిన RGV
చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.
News January 23, 2025
వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ
AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.