News October 3, 2024
రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!
TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంది. ఈనెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజులపాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
Similar News
News November 9, 2024
ఎక్కడున్నవాళ్లు అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు: ప్రభుత్వం
TG: రెండు రోజులుగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన అధికారులు నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే వివారాలు నమోదు చేయించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌లో అడ్రస్‌తో సంబంధం లేదని పేర్కొంది. అయితే సిబ్బంది వచ్చినప్పుడు ఆధార్, రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాసుపుస్తకం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.
News November 9, 2024
మీ ఇంటికి సర్వే స్టిక్కర్ అంటించారా?
TG: కులగణనలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది 2 రోజులుగా రాష్ట్రంలోని ఇళ్లకు సర్వే స్టిక్కర్లు అంటించారు. ఇవాళ్టి నుంచి ఆ ఇళ్లకు వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. అయితే HYDతో సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదు. దీంతో తమ వివరాలను నమోదు చేస్తారా? లేదా? అని ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి మీ ఇంటికి స్టిక్కర్ అంటించారా? కామెంట్ చేయండి.
News November 9, 2024
హమాస్‌ను బహిష్కరించిన ఖతర్
హమాస్‌ను బహిష్కరించాలని ఖతర్ నిర్ణయించింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా బందీల విడుదల, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హమాస్‌ను బహిష్కరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలను ఈ మేరకు ఖతర్ అంగీకరించింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని హమాస్ నాయకులకు స్పష్టం చేసింది. దీనిపై హమాస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.