News November 2, 2024

రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు

image

AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.

Similar News

News November 24, 2025

డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

image

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్‌పై అధికారులు చర్చిస్తున్నారు.

News November 24, 2025

పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత ప్లేయర్లు

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత ప్లేయర్ల ఆటతీరు మారడం లేదు. నిలకడ లేమితో వికెట్లు పారేసుకుంటున్నారు. తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒక్కడే 58 రన్స్‌తో కాస్త రాణించారు. రాహుల్(22), సుదర్శన్(15), నితీశ్(10), పంత్(7), జడేజా(6), జురెల్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.

News November 24, 2025

BMC బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్‌.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bmcbankltd.com/