News June 25, 2024
గిరిజన ప్రాంతాల్లో రేషన్ షాపుల్లోనే రేషన్: సంధ్యారాణి

AP: గిరిజన ప్రాంతాల్లో MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ఇకపై రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో 960 రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. గిరిజన వసతిగృహాల్లో ANMలు, ఫీడర్ అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు మళ్లీ తెస్తామని వెల్లడించారు.
Similar News
News February 18, 2025
విద్యార్థుల వద్ద కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవు

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.
News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.