News December 31, 2024
రేషన్ బియ్యం మాయం.. నిందితులకు రిమాండ్
AP: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం ఘటనలో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. నిందితులుగా గోదాము మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావు తదితరులు ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
Similar News
News January 25, 2025
జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్
జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.
News January 25, 2025
నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల
ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
News January 25, 2025
దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్
AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.