News July 12, 2024
రత్న భాండాగారం.. అధికారులకు ‘సర్పాల’ భయం

ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ నెల 14న రత్న భాండాగారం తెరవనున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News October 16, 2025
బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.
News October 16, 2025
లోకేశ్ కౌంటర్ కర్ణాటక ఐటీ మంత్రికేనా?

గూగుల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.22వేల కోట్ల రాయితీలు ఇస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్న వ్యాఖ్యానించారు. అలాంటి రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని పలువురు విమర్శిస్తారని చెప్పారు. ఈ కామెంట్లకే ఏపీ మంత్రి లోకేశ్ <<18020050>>కౌంటర్<<>> ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా పెట్టుబడులు సెగ పొరుగువారికి తగులుతోందని ట్వీట్ చేశారు.
News October 16, 2025
మేం కులసర్వేలో పాల్గొనం: నారాయణమూర్తి దంపతులు

కర్ణాటక ప్రభుత్వ కుల, విద్య, ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, అతని భార్య సుధా మూర్తి నిరాకరించారు. ‘మేం వెనుకబడిన తరగతికి చెందినవాళ్లం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నాం. మా సమాచారాన్ని పొందడం వల్ల ప్రభుత్వానికి లేదా OBCలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సర్వే ప్రాథమిక ఉద్దేశం BCలను గుర్తించి, వారికి సౌకర్యాలు కల్పించడం’ అని డిక్లరేషన్ ఫాం ఇచ్చారని సమాచారం.