News May 26, 2024
రేవ్ పార్టీ.. ఈ సారి నన్ను వదిలేశారు: నవదీప్

బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు వదంతులు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ చెప్పారు. ఈసారి మీ పేరు ఎందుకు బయటకు రాలేదని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘మంచే జరిగింది. ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ ప్రచారంలో ఆయన మాట్లాడారు. రేవ్ పార్టీ అంటే రాత్రి, పగలు జరిగేదని, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది చెప్పారు.
Similar News
News February 8, 2025
వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.
News February 8, 2025
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)
News February 8, 2025
BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్‌లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.