News April 4, 2024

కామెడీ కథకు ఓకే చెప్పిన రవితేజ?

image

మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్‌కు పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. కానీ, ప్రస్తుతం ఆయన ఎంటర్‌టైన్మెంట్ సినిమాలను పక్కన పెట్టి యాక్షన్ మూవీలు చేస్తూ హిట్ అందుకోలేకపోతున్నారు. అభిమానులు కూడా డిమాండ్ చేస్తుండడంతో రవితేజ కామెడీ కథను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘సామజవరగమన’ కథా రచయిత భాను బోగవరపు చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందట. అతడిని దర్శకుడిగా పరిచయం చేయాలని డిసైడ్ అయినట్లు సినీ వర్గాల సమాచారం.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

image

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

image

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.

News September 18, 2025

జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

image

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.