News April 4, 2024

కామెడీ కథకు ఓకే చెప్పిన రవితేజ?

image

మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్‌కు పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. కానీ, ప్రస్తుతం ఆయన ఎంటర్‌టైన్మెంట్ సినిమాలను పక్కన పెట్టి యాక్షన్ మూవీలు చేస్తూ హిట్ అందుకోలేకపోతున్నారు. అభిమానులు కూడా డిమాండ్ చేస్తుండడంతో రవితేజ కామెడీ కథను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘సామజవరగమన’ కథా రచయిత భాను బోగవరపు చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందట. అతడిని దర్శకుడిగా పరిచయం చేయాలని డిసైడ్ అయినట్లు సినీ వర్గాల సమాచారం.

Similar News

News April 20, 2025

థ్రిల్లింగ్ విక్టరీ.. అద్భుతం చేసిన ఆవేశ్

image

నిన్న LSGతో మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన RR మొదటి నుంచీ గెలుపు దిశగానే సాగింది. 17 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 156/2. 18 బంతుల్లో 25 రన్స్ కావాలి. అంతా విజయం ఖాయమనుకున్నారు. అయితే LSG బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో జైస్వాల్, పరాగ్‌ను ఔట్ చేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. చివరి ఓవర్‌లో RRకు 9 రన్స్ కావాల్సి ఉండగా 6 పరుగులే ఇచ్చి హెట్మైర్ వికెట్ కూల్చి LSGకి విక్టరీ అందించారు.

News April 20, 2025

వారికి పెన్షన్ పునరుద్ధరణ?

image

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24లక్షల మంది పెన్షన్‌దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్లు సెర్ప్ గుర్తించింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి పేరు తొలగిస్తున్నారు. అలాంటి వారు సొంతూరుకు వస్తే పెన్షన్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతోంది.

News April 20, 2025

TGRJC CET: ఇంకా 3 రోజులే ఛాన్స్

image

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే TGRJC CET-2025కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల్లో (ఈనెల 23తో) అప్లికేషన్ గడువు ముగియనుంది. <>https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/<<>> వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10న ఉదయం 10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!