News March 8, 2025
‘నేను.. శైలజ’ దర్శకుడితో రవితేజ మూవీ?

మాస్ మహారాజా మరో మూవీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘నేను.. శైలజ’, ‘చిత్రలహరి’ సినిమాల దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఓ మూవీలో రవితేజ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం.
Similar News
News March 22, 2025
నేడు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

తమిళనాడులో అధికార డీఎంకే అధ్యక్షతన డీలిమిటేషన్‌పై నేడు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెన్నై చేరుకున్నారు. వారికి అక్కడి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం నేతలందరూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
News March 22, 2025
నేటి నుంచే ఐపీఎల్ మహాసంగ్రామం

నేటి నుంచి మహాసంగ్రామానికి తెరలేవనుంది. క్రికెట్ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్ ఇవాళ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. ఈ సీజన్‌లో తలపడే 10 జట్లలో విజేతగా ఏ టీమ్ నిలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి?
News March 22, 2025
హమాస్ సైనిక నిఘా చీఫ్‌ను అంతం చేశాం: ఇజ్రాయెల్

హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్‌గా ఉన్న ఒసామా టబాష్‌ను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు పేర్కొంది. హమాస్ ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో నిర్దేశించే టార్గెటింగ్ యూనిట్‌కీ ఒసామా నేతృత్వం వహిస్తున్నాడని తెలిపింది. దీనిపై హమాస్ నుంచి స్పందనేమీ రాలేదు.