News September 19, 2024

రవిచంద్రన్ అశ్విన్‌.. ది ఆల్‌రౌండర్!

image

చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్‌రౌండర్‌ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్‌గా 500 వికెట్లు, బ్యాటర్‌గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్‌ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్‌ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.

Similar News

News December 28, 2025

గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు!

image

TG: పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా 2025-26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

News December 28, 2025

సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

image

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!

News December 28, 2025

DRDOలో JRF పోస్టులు

image

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<>HEMRL<<>>) 2 JRF పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(కెమిస్ట్రీ), NET, M.Tech(పాలిమర్స్/కెమికల్ ఇంజినీరింగ్/మెకానికల్/ఏరోస్పేస్), BE, బీటెక్, GATE ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.37,000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/