News October 1, 2024

అరుదైన క్లబ్‌లో చేరిన రవీంద్ర జడేజా

image

టెస్ట్ క్రికెట్‌లో 3000 రన్స్ చేయడంతో పాటు 300 వికెట్లు తీసిన 11వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచారు. BANతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనతను సాధించారు. అతని కంటే ముందు ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హ్యాడ్లీ, ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్, చమిందా వాస్, పొలాక్, వెటోరి, బ్రాడ్, అశ్విన్ ఈ లిస్టులో చేరారు. అలాగే టెస్టుల్లో 300 వికెట్లు తీసిన తొలి ఇండియన్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జడేజా రికార్డు సృష్టించారు.

Similar News

News October 11, 2024

GOOD NEWS.. వారికి బోనస్

image

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.

News October 11, 2024

9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు

image

TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

News October 11, 2024

తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.