News December 7, 2024

చదువుల నేల రాయలసీమ: పవన్ కళ్యాణ్

image

AP: అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని, ఇదొక చదువుల నేల అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి మహానుభావులు ఇక్కడే పుట్టారన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధిలో వెనుకబాటు కాదని, అవకాశాల కోసం ముందుండి నడిచే ప్రాంతం కావాలని ఆకాంక్షించారు.

Similar News

News January 14, 2025

రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్

image

భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.

News January 14, 2025

పండగ రోజు ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

సంక్రాంతి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తుంటారు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు ‘గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలోకి వచ్చేశాయి. ఏ సినిమా ఎలా ఉందో టాక్ కూడా తెలిసిపోయింది. మరి మీరు ఈరోజు వీటిలో ఏ మూవీకి వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

News January 14, 2025

ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్

image

ISRO ఛైర్మన్‌గా డా.వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD, క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదితో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 వంటి చరిత్రాత్మక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.