News May 22, 2024
కేంద్రానికి రూ.2.11లక్షల కోట్లు మంజూరు చేసిన RBI
FY24కి సంబంధించి కేంద్రానికి RBI రూ.2.11లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను మంజూరు చేసింది. FY23కి మంజూరు చేసిన మొత్తం (రూ.87,416 కోట్ల) కంటే 141% ఎక్కువ. దీంతో ద్రవ్యలోటు 0.4% వరకు తగ్గొచ్చనేది విశ్లేషకుల అంచనా. ఈ స్థాయిలో కేంద్రానికి డివిడెండ్ కేటాయించడం RBI చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరుతో కేంద్రం కోసం నిర్వహించే ప్రత్యేక నిధి పరిమితిని RBI 6.5శాతానికి పెంచింది.
Similar News
News October 8, 2024
డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు
AP: డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభం అవుతాయని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వంటి పలు అంశాలను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు పేర్కొన్నారు.
News October 8, 2024
హరియాణా ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన ప్రకటన
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రజల అభీష్టాన్ని BJP తారుమారు చేసిందని దుయ్యబట్టింది. హరియాణాలోని 3 జిల్లాల్లో EVMల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. BJPది ప్రజాభీష్టాన్ని తారుమారు చేసిన విజయంగా అభివర్ణించారు.
News October 8, 2024
రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్
AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.