News August 26, 2024
UPI లాగే ULI తీసుకొస్తున్న ఆర్బీఐ

చెల్లింపుల విధానాన్ని సమూలంగా మార్చేసిన యూపీఐ తరహాలోనే ఆర్బీఐ మరో కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. రుణాలను సులువుగా జారీ చేసేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI)ను ఆరంభించబోతోంది. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుణాల రంగంలో ULI పరివర్తన తేగలదు. JAM-UPI-ULI త్రయం దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను విప్లవాత్మకంగా మార్చగలదు. రుణ గ్రహీతలకు ఇదెంతో ఉపయోగం’ అని శక్తికాంతదాస్ అన్నారు.
Similar News
News November 12, 2025
మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.
News November 12, 2025
ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>
News November 12, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.


