News August 26, 2024
UPI లాగే ULI తీసుకొస్తున్న ఆర్బీఐ
చెల్లింపుల విధానాన్ని సమూలంగా మార్చేసిన యూపీఐ తరహాలోనే ఆర్బీఐ మరో కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. రుణాలను సులువుగా జారీ చేసేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI)ను ఆరంభించబోతోంది. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుణాల రంగంలో ULI పరివర్తన తేగలదు. JAM-UPI-ULI త్రయం దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను విప్లవాత్మకంగా మార్చగలదు. రుణ గ్రహీతలకు ఇదెంతో ఉపయోగం’ అని శక్తికాంతదాస్ అన్నారు.
Similar News
News December 5, 2024
మంచు దుప్పటిలా మారిన లార్డ్స్ స్టేడియం
క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా క్రిస్మస్‌కు ముందు ఇంగ్లండ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.
News December 5, 2024
నేడు ముంబైకి సీఎం చంద్రబాబు
AP: మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. కాగా చంద్రబాబు పర్యటనల కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నియమితులయ్యారు. గతంలో చంద్రబాబు ఎన్నికల పర్యటనలను కూడా ఈయనే చూసుకున్నారు.
News December 5, 2024
అమ్మాయిలు అలాంటివాడినే ప్రేమిస్తున్నారు: షాహిద్
నేటి తరం అమ్మాయిలు కబీర్ సింగ్(తెలుగులో అర్జున్ రెడ్డి) వంటి అబ్బాయిల్నే ప్రేమిస్తున్నారని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కబీర్ పాత్రని నేను కచ్చితంగా ఇష్టపడను. కానీ అలాంటి వారు సొసైటీలో ఉన్నారు. ఆ పాత్ర చేసే అనేక పనులు ఆమోదయోగ్యం కాదు. అయితే, చాలామంది అమ్మాయిలు అలాంటి వాళ్లను ప్రేమిస్తున్నారు. అందుకే ఆ సినిమా చేశాం. చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టం’ అని పేర్కొన్నారు.