News December 6, 2024

RBI మీటింగ్: CRR తగ్గిస్తే ఏమవుతుందంటే..

image

CRR అంటే క్యాష్ రిజర్వు రేషియో. ప్రతి బ్యాంకు RBI వద్ద కొంత నగదును ఉంచాలి. ఎంతమేర ఉంచాలో RBI MPC నిర్ణయిస్తుంది. ప్రస్తుతమిది 4.5 శాతంగా ఉంది. నేటి మీటింగులో CRRను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రూ.1.10 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నగదును బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. దీంతో లిక్విడిటీ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోలు శక్తి, వస్తూత్పత్తి పుంజుకుంటాయి.

Similar News

News March 14, 2026

BHPL: సింగరేణి ముస్లిం ఉద్యోగులకు GOOD NEWS

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 అడ్వాన్స్ కింద ఈ నెల 18న బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ అడ్వాన్స్‌ను ఏప్రిల్ నెల వేతనాల నుంచి ప్రారంభించి 10 సమాన నెలవారీ వాయిదాల్లో తిరిగి రికవరీ చేసుకోనుంది.

News March 14, 2026

దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌లో నారా, నందమూరి ఫ్యామిలీ

image

AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక ఇవాళ HYDలో జరిగింది. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ వారి తరఫున నందమూరి బాలకృష్ణ దంపతులు దేవాన్ష్‌తో పాటు లోకేశ్, బ్రాహ్మణికి నూతన వస్త్రాలు పెట్టారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగారు. వీటిని లోకేశ్ Xలో షేర్ చేశారు. దేవాన్ష్ ఎదుగుదల చూసి తామందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News March 14, 2026

రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

image

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్‌ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.