News January 30, 2025
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. నష్టాలను తగ్గించుకునేందుకు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై మెరుగైన పర్యవేక్షణ ఉండాలని సూచించింది. అలాగే లిక్విడిటినీ పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
Similar News
News November 17, 2025
BRIC-THSTIలో ఉద్యోగాలు

BRIC-ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్& టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (<
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.
News November 17, 2025
జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ నల్లగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. బైక్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో గొల్లపల్లి మండలం శేకల్లకు చెందిన అరుణ్(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్పై ఉన్న మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


