News March 6, 2025

‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

image

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.

Similar News

News March 27, 2025

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ ఆందోళన

image

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు

image

AP: Dy.CM పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలోని మూలపేటలో రికార్డింగ్ డాన్సుల వీడియో SMలో వైరలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా అర్ధరాత్రి అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. ఓ వైపు టెన్త్ పరీక్షలు జరుగుతుంటే ఇలాంటి డాన్సులు ఏర్పాటు చేయడం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. పవన్ స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా గైడ్‌లైన్స్ ప్రకారం ఆ <>వీడియో<<>>ను పబ్లిష్ చేయలేకపోతున్నాం.

News March 27, 2025

రోహిత్‌ను రోజూ 20KM పరిగెత్తమని చెప్తా: యువరాజ్ తండ్రి

image

దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీమ్ ఇండియాకు కోచ్‌గా నియమిస్తే రోహిత్ శర్మను రోజూ 20KM పరిగెత్తమని చెప్తానని అన్నారు. ప్రస్తుత ఆటగాళ్లతోనే ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. రోహిత్, కోహ్లీని రంజీ ట్రోఫీలో ఆడించాలన్నారు. వారిద్దరూ వజ్రాల్లాంటి ప్లేయర్లని కొనియాడారు.

error: Content is protected !!