News November 17, 2024

వచ్చే వారం ‘RC16’ షురూ?

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం మైసూర్‌లో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని మూవీ వర్గాలు వెల్లడించాయి. క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Similar News

News April 15, 2026

పెద్ది సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాలతో జూన్ నెలకు పోస్ట్‌పోన్ అయింది.

News April 15, 2026

IPL చరిత్రలో అదిరిపోయే మ్యాచ్.. గుర్తుందా?

image

ఏడాది కిందట ఇదే రోజు IPLలో అరుదైన రికార్డ్ నమోదైంది. KKR, PBKS మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. తొలుత పంజాబ్ 111 పరుగులే చేసింది. దీంతో డికాక్, నరైన్, రింకూ, రస్సెల్ తదితరులతో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న KKR ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ PBKS అద్భుతం చేసింది. చాహల్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీయడంతో 95 రన్స్‌కే ఆలౌటైంది. IPL చరిత్రలో ఇదే లోయెస్ట్ స్కోర్ డిఫెండింగ్ మ్యాచ్ కావడం విశేషం.

News April 15, 2026

ముసలావిడే కానీ మహానుభావురాలు!

image

40ఏళ్లు దాటేసరికే జీవితం అయిపోయిందని చాలా మంది నిరుత్సాహపడుతున్న రోజులివి. కానీ కొత్త గమ్యాలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రభావతి భగవతి అనే 98ఏళ్ల బామ్మ. 2017లో భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని జయించేందుకు ఇతరుల ప్రోత్సాహంతో 2018లో ‘నానీస్ నాశ్తా’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200కుపైగా కుటుంబాలకు గుజరాతీ, మహారాష్ట్ర వంటకాలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.