News March 18, 2024
ముంబైని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి RCB

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన IPL రెండో ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నిన్న WPL-2024 ట్రోఫీని RCB ఉమెన్స్ జట్టు గెలవడంతో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం RCBకి 12.7M, MIకి 12.6M ఫాలోవర్లున్నారు. ప్రథమ స్థానంలో CSK జట్టు (14.1M) ఉంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో చాలా మంది MIని అన్‌ఫాలో చేశారు.
Similar News
News December 16, 2025
నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.
News December 16, 2025
భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News December 16, 2025
‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.


