News April 24, 2024

తన చెత్త రికార్డును రిపీట్ చేసిన RCB

image

ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న RCB అభిమానులను నిరాశపరుస్తోంది. IPL-2019లో తొలి 8 మ్యాచ్‌ల తర్వాత కేవలం 2 పాయింట్లు సాధించగా, ఆ చెత్త రికార్డును ఈ ఏడాదీ రిపీట్ చేసింది. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్‌లను గెలిచినా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లే ఛాన్స్‌ను కోల్పోయింది. వచ్చే ఏడాదైనా సమతూకంతో ప్లేయర్లను తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కలెక్టర్

image

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

News January 14, 2026

పండుగల్లో ఇలా రెడీ..

image

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.

News January 14, 2026

సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

image

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.