News November 25, 2024

MI కీలక ఆటగాళ్లను దక్కించుకున్న RCB

image

ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు టిమ్ డేవిడ్(రూ.5.25 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు MI విల్ జాక్స్‌ను కొన్న సమయంలో ఆర్సీబీ RTM ఉపయోగించలేదు. ఇందుకు ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీ సీఈఓను టేబుల్ దగ్గరికి వెళ్లి మరీ హగ్ చేసుకున్నారు.

Similar News

News November 25, 2024

PPP పద్ధతిలో 18 స్టేట్ హైవేలు

image

APలోని 18 స్టేట్ హైవేలకు చెందిన 1307కి.మీ మేర రోడ్లను పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రైవేట్ సంస్థలు రోడ్లను అభివృద్ధి చేసి, టోల్ వసూలు చేస్తాయి. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లతో పాటు ఇంకా ఎవరికి మినహాయింపు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది. ప్రజలపై భారం లేకుండా కేవలం భారీ, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే టోల్ ఉండటాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

News November 25, 2024

APలో పీపీపీ పద్ధతిలో నిర్మించే రోడ్లు ఇవే

image

చిలకలపాలెం-రామభద్రపురం-రాయగడ, VZM-పాలకొండ, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం, భీమునిపట్నం-నర్సీపట్నం, కాకినాడ-జొన్నాడ, కాకినాడ-RJY, ఏలూరు-మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం-అశ్వారావుపేట, ఏలూరు-జంగారెడ్డిగూడెం, GNT-పర్చూరు, GNT-బాపట్ల, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు, బేస్తవారిపేట-ఒంగోలు, రాజంపేట -గూడూరు, ప్యాపిలి-బనగానపల్లి, దామాజీ పల్లి-తాడిపత్రి, జమ్మలమడుగు -కొలిమిగుండ్ల, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట

News November 25, 2024

RCB జట్టు ఇదే..!

image

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ ఈసారి ఆచితూచి వ్యవహరించింది. రిటెన్షన్లతో కలుపుకుని మొత్తం 22 మందిని కొనుగోలు చేసింది. జట్టు: కోహ్లీ, పటీదార్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషారా, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, జితేశ్ శర్మ, భువనేశ్వర్, కృనాల్ పాండ్య, జోస్ హేజిల్ వుడ్, రసిక్ దార్, స్వప్నిల్ సింగ్, భండాగే, బేథేల్, పడిక్కల్, ఎంగిడి, చికారా, అభినందన్, రాతే,