News November 25, 2024

MI కీలక ఆటగాళ్లను దక్కించుకున్న RCB

image

ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు టిమ్ డేవిడ్(రూ.5.25 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు MI విల్ జాక్స్‌ను కొన్న సమయంలో ఆర్సీబీ RTM ఉపయోగించలేదు. ఇందుకు ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీ సీఈఓను టేబుల్ దగ్గరికి వెళ్లి మరీ హగ్ చేసుకున్నారు.

Similar News

News December 6, 2024

PHOTOS: తల్లితో నాగచైతన్య

image

అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీకి జన్మించిన కుమారుడే నాగచైతన్య. నిర్మాత డి.రామానాయుడు కూతురే లక్ష్మీ. ఆమె సోదరులు వెంకటేశ్, సురేశ్ బాబు.. చైతూకు మేనమామలు అవుతారు.

News December 6, 2024

S.K అధ్య‌క్షుడు యూన్‌కు అభిశంస‌న త‌ప్ప‌దా?

image

నియంతృత్వ పోక‌డ‌లు ప్ర‌ద‌ర్శించిన ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంస‌న త‌ప్పేలా లేదు. దేశంలో సైనిక పాల‌న విధించిన యూన్ ప్ర‌జాగ్ర‌హానికి త‌లొగ్గిన విష‌యం తెలిసిందే. అయినా ఆయ‌న్ను త‌ప్పించేందుకు అధికార‌, విప‌క్షాలు అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మయ్యాయి. యూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. 2027 వ‌ర‌కు ప‌ద‌వీకాలం ఉన్నా అభిశంస‌న నెగ్గితే యూన్ త‌ప్పుకోవాల్సిందే.

News December 6, 2024

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

TG: విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడంలేదు. ఇటీవల శ్రీచైతన్య, నారాయణ సంస్థల్లో పలువురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మేడ్చల్ సమీపంలోని MLRIT ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని శ్రావణి(18) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకుంది. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారంటూ శ్రావణి బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.