News March 15, 2025

RCB: ఈసారైనా కప్ నమ్‌దేనా..!

image

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్‌వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?

Similar News

News April 19, 2025

ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

image

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 19, 2025

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

image

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

News April 19, 2025

ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

image

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.

error: Content is protected !!