News April 28, 2024
అప్పటివరకు RCB టైటిల్ కొట్టదు: భజ్జీ

నాణ్యమైన బౌలర్లు లేనంతవరకూ RCB టైటిల్ సాధించలేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘స్టార్ బ్యాటర్లతో ఎల్లప్పుడూ మ్యాచ్ గెలవలేం. మంచి బౌలర్లు కూడా జట్టులో ఉండాలి. కానీ అలాంటి బౌలింగ్ దళం ఆర్సీబీకి లేదు. వచ్చే వేలంలోనైనా నాణ్యమైన బౌలర్లను తీసుకోవాలి. అప్పుడే జట్టులో సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే ఆర్సీబీ సపోర్టింగ్ సిబ్బందిలో భారతీయుడు ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.


