News April 6, 2024
RCBvsRR: రాజస్థాన్ టార్గెట్ 184 రన్స్
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కోహ్లీ సెంచరీ(113*)తో చెలరేగగా, డుప్లెసిస్ 44, మ్యాక్స్‌వెల్ 1, సౌరవ్ చౌహాన్ 9, కామెరూన్ గ్రీన్ 5* రన్స్ చేశారు. చాహల్ 2, బర్గర్ 1 వికెట్ తీశారు. విజయం కోసం రాజస్థాన్ 184 రన్స్ చేయాలి.
Similar News
News January 13, 2025
యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.
News January 13, 2025
మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత
AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.
News January 13, 2025
చంద్రబాబు వచ్చాకే ప్రతి ఇంటా సంక్రాంతి ఆనందాలు: టీడీపీ
AP: ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం చేసి సంక్రాంతి ఆనందం లేకుండా చేశారని టీడీపీ Xలో విమర్శించింది. CBN పాలన ప్రారంభమయ్యాక తొలి సంక్రాంతికే ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపింది. జగన్ విధ్వంసంతో ప్రతి రోజూ రాష్ట్రంలో అలజడిగా ఉండేదని, చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనతో రోజూ పండుగలా ఉందని పేర్కొంది. రైతులు, పేదలు, యువత ఎంతో సంతోషంగా ఉన్నారని, ఛార్జీలు పెంచలేదని రాసుకొచ్చింది.