News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ: మందకృష్ణ

TG: ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశముంది.
Similar News
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.
News November 21, 2025
రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.


