News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ: మందకృష్ణ

TG: ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశముంది.
Similar News
News February 14, 2025
రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.
News February 14, 2025
ట్రెండింగ్.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 14, 2025
ఇక్కడ అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్ లభించును

ఏంటి షాక్ అయ్యారా? బెంగళూరులో వాలంటైన్స్ డే సందర్భంగా ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.389 చెల్లిస్తే చాలు మీకు ఆ రోజుకు ప్రియుడు దొరికినట్లే. నగరంలోని చాలా చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ సంస్కృతి చైనా, జపాన్, థాయ్‌లాండ్‌లో ప్రాచుర్యం పొందింది. ఇది నగర సంస్కృతికి ముప్పుగా భావించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు.