News November 16, 2024

3 నెలలు బస్తీలో ఉండేందుకు సిద్ధం: కిషన్ రెడ్డి

image

TG: మూసీ పరీవాహకంలో 30 ఏళ్ల క్రితమే బస్తీలు అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం సబబు కాదన్నారు. తాను 3 నెలలు బస్తీల్లో ఉండటానికైనా సిద్ధమని, అవసరమైతే తన ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 16, 2024

స్టైలిష్ బామ్మ

image

జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా (లెజెండరీ గ్లామ్మా) అనే వృద్ధురాలు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఆమె తన మనవరాలు డయానా కౌంబాతో కలిసి స్టైలిష్ డ్రెస్సులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె స్టైలిష్ ఐకాన్‌గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తనను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చోలా చెప్పుకొచ్చారు. ఆమె ఎలా రెడీ అవుతారో మీరూ చూసేయండి.

News November 16, 2024

గుడ్ న్యూస్.. ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు

image

TG: పదవ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండితో గడువు ముగియనుండగా ఈ నెల 28 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. చలానా విధానాన్ని రద్దు చేస్తూ, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

News November 16, 2024

నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు!

image

యూరప్‌లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.