News November 16, 2024

3 నెలలు బస్తీలో ఉండేందుకు సిద్ధం: కిషన్ రెడ్డి

image

TG: మూసీ పరీవాహకంలో 30 ఏళ్ల క్రితమే బస్తీలు అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం సబబు కాదన్నారు. తాను 3 నెలలు బస్తీల్లో ఉండటానికైనా సిద్ధమని, అవసరమైతే తన ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 4, 2024

ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన టీమ్ ఇండియా

image

అడిలైడ్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు 5వేలమందికి పైగా ఫ్యాన్స్‌ హాజరయ్యారు. భారత క్రికెటర్లను వారిలో పలువురు అసభ్యంగా దూషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోహిత్, పంత్‌ బరువుపై ట్రోల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారత ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానుల్ని అనుమతించేది లేదని బీసీసీఐ ప్రకటించింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌కు 50మంది మాత్రమే రావడం గమనార్హం.

News December 4, 2024

కీర్తి సురేశ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్

image

మహానటి కీర్తి సురేశ్, తన ప్రియుడు అంథోనీని పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి అని ఓ వెడ్డింగ్ కార్డ్ వైరలవుతోంది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం. ఇటీవల కీర్తి తన కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

News December 4, 2024

బాలయ్య కొత్త గెటప్ చూశారా?

image

పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.