News September 27, 2024
Reasi Bus Attack: హైబ్రీడ్ టెర్రరిస్టుల కోసం NIA రైడ్స్

రియాసీ బస్ అటాక్ కేసులో NIA దూకుడు ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని 7 ప్రాంతాల్లో ఉదయం నుంచి రైడ్స్ చేపట్టింది. రియాసీ, రాజౌరి జిల్లాలో హైబ్రీడ్ టెర్రరిస్టులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల కోసం వెతుకుతోంది. ఇదే కేసులో జూన్ 30న సైతం NIA రైడ్స్ చేయడం గమనార్హం. జూన్ 9న సాయంత్రం శివ్ఖోరి నుంచి కత్రా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సును టెర్రరిస్టులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది మరణించారు.
Similar News
News October 24, 2025
ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్‌తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.
News October 24, 2025
మృత్యు శకటాలుగా ప్రైవేట్ బస్సులు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారాయి. 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇవాళ మరో ప్రమాదంలో 20కి పైగా మరణించారు. అతివేగం, నిర్లక్ష్యం, సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల పాటు అధికారులు హడావిడి చేసినా ఆ తర్వాత తనిఖీలు చేయడం లేదు.
News October 24, 2025
ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, SPకి రేవంత్ ఆదేశం

చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది HYDలో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.


