News September 27, 2024
Reasi Bus Attack: హైబ్రీడ్ టెర్రరిస్టుల కోసం NIA రైడ్స్
రియాసీ బస్ అటాక్ కేసులో NIA దూకుడు ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని 7 ప్రాంతాల్లో ఉదయం నుంచి రైడ్స్ చేపట్టింది. రియాసీ, రాజౌరి జిల్లాలో హైబ్రీడ్ టెర్రరిస్టులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల కోసం వెతుకుతోంది. ఇదే కేసులో జూన్ 30న సైతం NIA రైడ్స్ చేయడం గమనార్హం. జూన్ 9న సాయంత్రం శివ్‌ఖోరి నుంచి కత్రా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సును టెర్రరిస్టులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది మరణించారు.
Similar News
News October 10, 2024
జీవితాన్ని మార్చే రతన్ టాటా TOP QUOTES
* ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. వేగంగా మారుతున్న ప్రపంచంలో కచ్చితంగా ఫెయిలయ్యేందుకున్న ఏకైక స్ట్రాటజీ ఇదే * వేగంగా నడవాలంటే ఒంటరిగా వెళ్లండి. ఎక్కువ దూరం నడవాలంటే కలిసి వెళ్లండి * విజేతలంటే నాకిష్టం. నిర్దయతో విజయం అందుకొనేవాళ్లను ఇష్టపడను * జీవితంలో ముందుకెళ్లేందుకు ఆటుపోట్లు కీలకం. ఎందుకంటే ECGలో స్ట్రెయిట్ లైన్ వచ్చిందంటే మనం చనిపోయామని అర్థం * ఇతరులపై దయ, కరుణ చూపండి >>Shareit
News October 10, 2024
ఈరోజు సెలవా? కాదా?
తెలంగాణలో ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నేడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. అయితే సాధారణ సెలవు ఇవ్వాలని CMO ముఖ్య కార్యదర్శికి తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు మాత్రమే ఉండనుంది.
News October 10, 2024
అల్విదా రతన్‌జీ.. ఓ శకం ముగిసింది
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65% నిధులను దాతృత్వానికే వెచ్చించారు. లేదంటే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన తొలి వరుసలో ఉండేవారు. కానీ అవేమీ లెక్కచేయని గొప్ప మానవతావాది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అల్విదా రతన్‌జీ.