News November 6, 2024

జుట్టు రాలడానికి కారణాలివే..

image

☛ పోషకాలు(జింక్, ఐరన్, విటమిన్-ఏ) లేని ఆహారం తినడం
☛ మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణలు
☛ కెమికల్స్ ఎక్కువగా ఉన్న జెల్స్, షాంపూల, కలర్, హెయిర్ వ్యాక్స్ వాడకం
☛ పొల్యూషన్ కూడా హెయిర్ లాస్‌కి కారణం
★ జుట్టు ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయాలి. సహజసిద్ధమైన ఆయిల్స్‌తో జుట్టుకు మర్దన చేసుకోవాలి. పొల్యూషన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Similar News

News November 12, 2025

మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.

News November 12, 2025

ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

image

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>

News November 12, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.