News November 6, 2024
జుట్టు రాలడానికి కారణాలివే..
☛ పోషకాలు(జింక్, ఐరన్, విటమిన్-ఏ) లేని ఆహారం తినడం
☛ మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణలు
☛ కెమికల్స్ ఎక్కువగా ఉన్న జెల్స్, షాంపూల, కలర్, హెయిర్ వ్యాక్స్ వాడకం
☛ పొల్యూషన్ కూడా హెయిర్ లాస్‌కి కారణం
★ జుట్టు ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయాలి. సహజసిద్ధమైన ఆయిల్స్‌తో జుట్టుకు మర్దన చేసుకోవాలి. పొల్యూషన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Similar News
News December 8, 2024
టెస్ట్ క్రికెట్‌లో ఇంట్రస్టింగ్ ఫైట్!
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చూస్తుంటే ‘పొట్టోణ్ని పొడుగోడు కొడితే పొడుగోణ్ని పోచమ్మ కొట్టిందంట’ అన్న నానుడి గుర్తొస్తోంది. గత 2 నెలల్లో ఒక జట్టుపై సిరీస్ గెలిచిన టీమ్ మరో జట్టు చేతిలో వైట్ వాష్‌కు గురవుతోంది. OCTలో NZపై SL(2-0), NOVలో INDపై NZ(3-0), ఇప్పుడు NZపై ENG (2-0) సిరీస్ గెలిచాయి. SL కూడా ప్రస్తుతం SAతో సిరీస్‌లో వైట్ వాష్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
News December 8, 2024
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.33 కోట్లు
TG: రిటైర్డ్ కార్మికులు, అధికారులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి లాభాల్లో వాటాగా రూ.33 కోట్లను చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నెల 12న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎండీ బలరామ్ తెలిపారు.
News December 8, 2024
భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే..
డే నైట్ టెస్టులో తమకున్న తిరుగులేని రికార్డును ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో ఘనవిజయం దిశగా సాగుతోంది. 175 పరుగులకే భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మరోసారి నితీశ్ కుమార్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ 5, బోలాండ్ 3 వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 19 పరుగులు.