News November 7, 2024

11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ

image

AP: విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 1న అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై 5వ తేదీతో ముగుస్తుంది. DEC 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21-26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు నిర్వహిస్తారు. దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.

Similar News

News December 8, 2024

మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది: సీఎం రేవంత్

image

TG: ఏడాది పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని CM రేవంత్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, 55,000 జాబ్స్ అందించామని, 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని ట్వీట్ చేశారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

News December 8, 2024

102 ఏళ్ల వృద్ధురాలితో వందేళ్ల వృద్ధుడి ప్రేమ పెళ్లి

image

ప్రేమకు వయసుతో సంబంధం లేదనే మాటను USకు చెందిన ఓ వృద్ధజంట నిరూపించింది. మార్జొరీ ఫిటర్‌మాన్ అనే 102 ఏళ్ల వృద్ధురాలు, బెర్నీ లిట్‌మాన్ అనే 100 ఏళ్ల వృద్ధుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో 2024 మేలో ఒక్కటయ్యారు. దీంతో ఓల్డెస్ట్ న్యూలీవెడ్ కపుల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని GWR తాజాగా ప్రకటించింది.

News December 8, 2024

రెబెల్స్ చేతిలోకి సిరియా.. అధ్యక్షుడి పరారీ

image

సిరియా అంతర్యుద్ధంలో రెబెల్స్ విజయం సాధించారు. రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ గుర్తుతెలియని ప్రాంతానికి పరారైనట్లు తెలుస్తోంది. తమకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురుకాలేదని రెబెల్స్ పేర్కొన్నారు. ‘సెడ్నాయా జైల్లో ఉన్న సిరియా పౌరులను విడిపిస్తున్నాం. మన దేశానికి జరిగిన అన్యాయం ఈరోజుతో ముగిసింది’ అని ప్రకటనలో తెలిపారు.