News January 20, 2025

Record: బిట్‌కాయిన్ @ కోటి రూపాయలు

image

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. COIN DCX ప్రకారం తొలిసారిగా ₹కోటి విలువను దాటేసింది. గత 24 గంటల్లో ₹3.81లక్షలు పెరిగిన BTC ₹1.06 కోట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ₹1.04 కోట్ల వద్ద చలిస్తోంది. డాలర్ పరంగా చూస్తే $1,09,588 వద్ద గరిష్ఠాన్ని అందుకొని ప్రస్తుతం $1,08,491 వద్ద ట్రేడవుతోంది. 24 గంటల్లో $8000 ఎగిసింది.

Similar News

News February 7, 2025

ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

image

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.

News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News February 7, 2025

గాజా స్వాధీనంపై ట్రంప్‌ది గొప్ప ఆలోచన: నెతన్యాహు

image

గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!