News September 23, 2024
రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్‌లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.
Similar News
News October 15, 2024
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
News October 15, 2024
అనిల్ అంబానీని లాభాల్లోకి తెచ్చిన వారసులు
నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చి సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. వారి రాకతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలూ లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
News October 15, 2024
వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?
ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.