News April 12, 2024

రికార్డు సృష్టించారు

image

పపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. USAతో వన్డే మ్యాచ్‌లో PNG గెలిచింది. 44.2ఓవర్లలో USA 160 పరుగులకు ఆలౌట్ కాగా ఛేదనకు దిగిన PNG 36.2ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసి విజయం సాధించింది. తన్య రుమ 80(93బంతుల్లో) పరుగులతో రాణించారు. ఇదిలా ఉంటే PNG కెప్టెన్ కాయా అరువా(33) వారం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2024

టీ20ల్లో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్

image

సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్‌లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 14.1 ఓవర్లలోనే 200 రన్స్ చేసింది. ఈ ఏడాది HYDలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో IND 13.6 ఓవర్లలో ఈ ఘనత సాధించింది. అయితే 13.5 ఓవర్లలోనే వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఫాస్టెస్ట్ 200 రన్స్ చేసి తొలి స్థానంలో ఉంది.

News November 16, 2024

భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

image

చివరి టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 283/1 స్కోర్ చేసింది. తిలక్ వర్మ(120*), శాంసన్(109*) సెంచరీలతో చెలరేగారు. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 135 రన్స్ తేడాతో గెలిచింది.

News November 16, 2024

మరోసారి తండ్రైన రోహిత్‌.. టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రితిక కాసేపటి క్రితం పిల్లాడికి జన్మనిచ్చారు. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు. ఇదిలా ఉంటే జూ.రోహిత్ వచ్చేస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ అందుబాటులో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే భారత జట్టుకు గుడ్ న్యూస్ కానుంది.