News February 24, 2025
రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

AP: ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ MD కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.
Similar News
News February 24, 2025
మహిళలకు GOOD NEWS.. కొత్త పథకాలు

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను రూ.2 లక్షలు, రూ.లక్షకు పెంచనుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనుంది.
News February 24, 2025
అసెంబ్లీ సమావేశాలు.. ఆంక్షల విధింపు

AP: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్లు రద్దు చేశారు.
News February 24, 2025
నేడు KRMB ప్రత్యేక భేటీ

ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు, ఇతర అంశాలపై అధికారులు KRMB ఛైర్మన్ అతుల్ జైన్తో చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తోందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ నెల 21నే సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ విజ్ఞప్తితో నేటికి వాయిదా పడింది.